వాట్సాప్లో
స్టేటస్ ఆప్షన్ వచ్చేసింది. అదేంటి వచ్చి చాలా రోజులైంది కదా అనుకుంటున్నారా? మేం చెబుతోంది పాత వాట్సాప్ స్టేటస్ గురించి. మనసులోని భావాల్ని అక్షరాల రూపంలో పెట్టుకునే పాతకాలం స్టేటస్ గురించి. ఇమేజ్/వీడియో స్టేటస్ సౌకర్యాన్ని తీసుకొచ్చి అక్షరాల స్టేటస్ను ఇటీవల ఎత్తేసింది వాట్సాప్ . ఇప్పుడు మళ్లీ దాన్ని తీసుకొచ్చేసింది. అయితే ఈ సారి
స్టేటస్ వాక్యాలు కనిపించే ప్రాంతం మారింది. గతంలో మెనూ బటన్లో స్టేటస్ అని ఓ ఆప్షన్
ఉండేది. ఇప్పుడు సెట్టింగ్స్లో ఉండే మీ పేరును టచ్ చేస్తే దిగువన మొబైల్ నెంబర్ మీద మీ స్టేటస్ కనిపిస్తుంది. దాన్ని ఒత్తి స్టేటస్ను ఎడిట్ చేసుకోవచ్చు.
వీటిలో పని చేయదు
వచ్చే నెల 31 నుంచి కొన్ని స్మార్ట్ఫోన్లకు వాట్సాప్ అప్డేట్లు నిలిచిపోనున్నాయి. ఈ జాబితాలో సింబియాన్ ఎస్ 60, బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్బెర్రీ 10, విండోస్ ఫోన్ 7.1, ఐఫోన్ 3జీ ఎస్/ఐఓ, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 నోకియా ఎస్ 40 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే ఫోన్లు ఉన్నాయి. వాట్సాప్లో త్వరలో ప్రవేశపెట్టబోయే ఆప్షన్లకు ఆ ఫోన్లు సహకరించకపోవడం, వాట్సాప్ రక్షణ ప్రమాణాలకు తగ్గట్టుగా వాటి ఓఎస్లు లేకపోవడమే ఈ అప్డేట్ల నిలిపివేతకు కారణం.
No comments:
Post a Comment